Sip meaning in Telugu, sip in telugu



SIP meaning in Telugu  |SIP in telugu | సిప్ అంటే ఏమిటి?



SIP అంటే (SYSTEMATIC INVESTMENT PLAN)

అంటే మనం ఎంచుకున్న స్టాక్ లేదా మ్యూచువల్ ఫండ్ లో ప్రతినెలా లేదా మన సౌకర్యవంతమైన పీరియడ్ లో డబ్బును  క్రమం తప్పకుండ  పెట్టుబడి చేసే పద్దతిని SIP అంటాము.    

 అయితే ఎక్కువ మొత్తంలో ఒకే సారి  పెట్టుబడి చేసే వీలు లేని వారికోసం ఈ పద్దతి (SIP) చాలా బాగా ఉపయోగ పడుతుంది. 


మనం ఎక్కువగా ఈ  పద్దతిని మ్యూచువల్ ఫండ్స్ లో చూస్తుంటాం. ఇలా క్రమం తప్పకుండ పెట్టుబడి చేయటం వల్ల దీర్గకాలంలో చాలా మంచి లాభాలను గడించవచ్చు. 


ఉధాహరణకు :- సుబ్బారావు అనే వ్యక్తి పది సంవత్సరాల  పాటు  ప్రతి నెల 3000రూ|| క్రమం తప్పకుండ  పెట్టుబడి చేశాడు. ఇలా  చేయటం ద్వారా  అయితే మ్యూచువల్ ఫండ్స్ లో యావరేజ్ గా ఇంట్రెస్ట్ రేట్ 12% p .a వచ్చింది అనుకున్నా తను  పెట్టుబడి చేసిన డబ్బు (10*12*3000 = 360000 రూపాయలు  ) కాస్త  సంవత్సరాల తర్వాత సుబ్బారావు కి 697000 రూపాయలు వచ్చాయి . ఇలా అతి తక్కువ మొత్తంలో క్రమం తప్పకుండ పెట్టుబడి చేయటం ద్వారా మంచి లాభాలను  గడించాడు సుబ్బారావ్.


గమనిక :- వడ్డీరేటు ఎప్పుడు ఒకేలా ఉండక పోవచ్చు... 


ఈ  కాల్కులేషన్ ని సులభంగా చేయటానికి ఈ లింక్ ని క్లిక్ చేయండి.

Sip meaning in Telugu, sip in telugu





పైన ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తే ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది . పైన SIP ని సెలెక్ట్ చేసుకొని మంత్లీ పెట్టుబడిలో మీరు ఎంత అయితే పెట్టుబడి చెయ్యాలి అనుకుంటున్నారో ఆ అమౌంట్ ని సెలెక్ట్ చేసి , Return rate 12%  మరియు ఎన్ని సంవత్సరాల పాటు పెట్టుబడి చెయ్యాలి అనుకుంటున్నారు అనేధి సెలెక్ట్ చేస్తే మీకు సంబందించిన వవరాలు వస్తాయి. 



అయితే ముందుగా మీ యొక్క లక్ష్యాన్ని ఎంచుకోండి  ఉధాహరణకు :- రెటైర్ మెంట్ తర్వాత అవసరానికి  డబ్బులు కావచ్చు లేదా ఒక ఇల్లు కట్టుకోవడానికి ,పిల్లల చదువుల, విదేశాలకి వెళ్ళటం etc.. ఇలా మీ గోల్ ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని చేరటానికి  మీకు ఎంత డబ్బు అవసరం పడుతుంది మరియు ఎంత  సమయంలో మీ లక్ష్యాన్ని ని రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు , ఆ లక్ష్యాన్ని చేరాలి అంటే నెలకు ఎంత డబ్బు పెట్టుబడి చెయ్యాలి ఈ విషయాలు అన్నీ నోట్ చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాన్ని ఎంచుకోండి.

 


మీరు ఇపుడు యే AGE లో ఉన్న వెంటనే ఈ విషయం గురించి ఆలోచించండి . "ITS NEVER TOO LATE TO START" 

ఇంతవరకు వచ్చి చదివినందుకు దన్యావాధాలు .